Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 32:3-5

OTSA Telugu Contemporary Version

3 నేను మౌనంగా ఉండి,

రోజంతా మూలుగుతూ ఉన్నందుకు

నా ఎముకలు కృశించాయి.

4 రాత్రింబగళ్ళు మీ చేయి నాపై

భారంగా ఉంది;

వేసవిలో నీరు ఎండిపోయినట్లు

నాలో సారం యింకి పోయింది. సెలా

5 అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను

నా దోషాన్ని నేను దాచుకోలేదు.

"యెహోవా ఎదుట

నా అతిక్రమాలను ఒప్పుకుంటాను" అని ఒప్పుకున్నాను.

అప్పుడు నా అతిక్రమాన్ని

మీరు క్షమించారు. సెలా

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 నేను నిశ్శబ్దంగా ఉండి రాత్రంతా మూల్గుతున్నాను. దాంతో నా ఎముకలు బలహీనమై పోతున్నాయి.

    4 పగలూ రాత్రీ నా మీద నీ చెయ్యి భారంగా ఉంది. వేసవిలో దుర్భిక్షంలా నా శక్తి అంతా హరించుకు పోయింది. సెలా.

    5 అప్పుడే నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. నా దోషాన్ని ఇక నేను దాచిపెట్టుకోలేదు. నేను నా అతిక్రమాలను యెహోవా దగ్గర అంగీకరిస్తాను అనుకున్నాను. అప్పుడు నువ్వు నా పాపాలను క్షమించావు. సెలా.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.