1 యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను;
ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు.
2 నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపారు,
బురద ఊబిలో నుండి లేపి
నా పాదాలను బండ మీద నిలిపారు.
నిలబడడానికి నాకు స్థిరమైన స్థలాన్ని ఇచ్చారు.
3 మన దేవునికి ఒక స్తుతి పాటను,
ఆయన నా నోట ఒక క్రొత్త పాట ఉంచారు.
అనేకులు ఆయన చేసింది చూసి ఆయనకు భయపడతారు.
వారు యెహోవాలో నమ్మకం ఉంచుతారు.
17 కాని నా మట్టుకైతే, నేను దీనుడను, అవసరతలో ఉన్నవాడను;
ప్రభువు నా గురించి ఆలోచించుదురు గాక.
మీరే నా సహాయం, నా విమోచకుడు;
మీరే నా దేవుడు, ఆలస్యం చేయకండి.