1 నీటి వాగుల కోసం దుప్పి ఆశపడునట్లు,
నా దేవా, మీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది.
2 నా ప్రాణం దేవుని కోసం సజీవుడైన దేవుని కోసం దప్పికతో ఉన్నది.
నేనెప్పుడు ఆయన సన్నిధికి వెళ్లి ఆయనను కలుస్తాను?
3 "మీ దేవుడు ఎక్కడున్నాడు?"
అని నా శత్రువులు నాతో అంటూ ఉంటే రాత్రింబగళ్ళు,
నా కన్నీరే నాకు ఆహారం అవుతున్నాయి.
5 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు?
నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు?
దేవుని మీద నిరీక్షణ ఉంచు,
ఆయనే నా రక్షకుడు నా దేవుడు,
నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.
11 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు?
నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు?
దేవుని మీద నిరీక్షణ ఉంచు,
ఆయనే నా రక్షకుడు నా దేవుడు
నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.