1 ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి
నన్ను కరుణించండి;
మీ గొప్ప కనికరాన్ని బట్టి,
నా పాపాలను తుడిచివేయండి.
2 నా దోషాలన్నింటిని కడిగి,
నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి.
10 ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి,
నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి.
17 విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి;
పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని
దేవా, మీరు నిరాకరించరు.