Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 55:6,12-14,21,22

OTSA Telugu Contemporary Version

6 "ఆహా, పావురంలా నాకూ రెక్కలుంటే!

ఎగిరిపోయి హాయిగా ఉండేవాన్ని కదా!

12 ఒకవేళ ఒక శత్రువు నన్ను అవమానిస్తుంటే,

నేను దానిని భరించగలను;

నాకు వ్యతిరేకంగా శత్రువు లేస్తున్నట్లయితే,

నేను దాక్కోగలను.

13 కాని ఆ పని చేసిన నీవు నాలాంటి మనిషివి,

నా సహచరుడవు, నా ప్రియ స్నేహితుడవు

14 ఒకప్పుడు దేవుని మందిరానికి

ఆరాధికులతో పాటు

ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు

మనం మధురమైన సహవాసం కలిగి ఉన్నాము.

21 అతని మాటలు వెన్నలా మృదువుగా ఉంటాయి,

కాని అతని హృదయంలో యుద్ధం ఉంటుంది;

అతని మాటలు నూనె కన్న నున్నగా ఉంటాయి

కానీ అవి దూసిన ఖడ్గాల్లాంటివి.

22 మీ భారాన్ని యెహోవాపై మోపండి

ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు;

నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనివ్వరు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 ఆహా, నాకు గనక రెక్కలుంటే గువ్వలాగా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను.

    12 నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువైతే నేను దాన్ని సహించేవాడినే. నా పైకి లేచినవాడు నా పగవాడు కాడు. అదే అయితే నేను దాక్కోవచ్చు.

    13 ఆ పని చేసింది నువ్వు అంటే నా నెచ్చెలివి, నా చెలికాడివి. నా ప్రియమిత్రుడివి.

    14 మనం కలిసి మధుర సహవాసం అనుభవించాం. ఉత్సవంగా దేవుని మందిరానికి వెళ్లాం.

    21 అతని నోటి మాటలు వెన్నలాగా మృదువుగా ఉన్నాయి. కాని అతని హృదయం నిండా కలహం ఉంది. అతని మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి గానీ అవి నిజానికి దూసుకు వస్తున్న కత్తులు.

    22 నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.