Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 67

ప్రధాన గాయకునికి. తంతివాద్యాలతో పాడదగినది. ఒక కీర్తన. ఒక గీతము.

1 దేవుడు మామీద దయచూపి దీవించును గాక,

ఆయన ముఖం మాపై ప్రకాశించును గాక. సెలా

2 తద్వార భూమి మీద మీ మార్గాలు

దేశాలన్నిటికి మీ రక్షణ తెలుస్తాయి,

3 దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక;

సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.

4 దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక,

ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు

భూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా

5 దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక;

సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.

6 భూమి దాని పంటను ఇస్తుంది;

దేవుడు, మా దేవుడు, మమ్మల్ని దీవిస్తారు.

7 అవును, దేవుడు మనల్ని దీవించును గాక,

తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.