2 కానీ నా మట్టుకైతే, నా పాదాలు దాదాపు జారిపోయాయి;
నా పాదం దాదాపు పట్టును కోల్పోయింది.
3 దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు
నేను అహంకారుల మీద అసూయ పడ్డాను.
16,17 ఇదంతా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు,
నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించే వరకు
అది నన్ను గాఢంగా ఇబ్బంది పెట్టింది;
అప్పుడు నేను వారి చివరి గమ్యమేంటో గ్రహించాను.