Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 78:1-8

1 నా ప్రజలారా! నా ఉపదేశం వినండి;

నా నోటి మాటలు వినండి.

2 నేను ఉపమానం చెప్పడానికి నా నోరు తెరుస్తాను;

పూర్వకాలం నుండి దాచబడి ఉన్న విషయాలను నేను తెలియజేస్తాను.

3 మనం విన్నవి మనకు తెలిసినవి

మన పూర్వికులు మనకు చెప్పిన సంగతులను చెప్తాను.

4 వారి వారసులకు తెలియకుండా వాటిని దాచిపెట్టము;

యెహోవా చేసిన స్త్రోత్రార్హమైన కార్యాలను,

ఆయన శక్తిని, ఆయన చేసిన అద్భుతాలను గురించి

తర్వాతి తరానికి మేము చెప్తాం.

5 ఆయన యాకోబుకు చట్టాలు విధించారు

ఇశ్రాయేలులో నిబంధనలను స్థాపించారు,

వారి పిల్లలకు దానిని బోధించుమని

మన పూర్వికులకు ఆజ్ఞాపించారు.

6 తద్వార తర్వాతి తరం వాటిని తెలుసుకుంటారు,

ఇంకా పుట్టబోయే పిల్లలు కూడా తెలుసుకుంటారు,

వారు వారి పిల్లలకు బోధిస్తారు.

7 అప్పుడు వారు దేవునిలో నమ్మకం ఉంచుతారు

ఆయన కార్యాలను మరచిపోరు

ఆయన ఆజ్ఞలను పాటిస్తారు.

8 వారు తమ పితరుల్లా అనగా

మొండితనం తిరుగుబాటు స్వభావం కలిగిన తరం గాను,

దేవుని పట్ల నమ్మకమైన హృదయాలు లేనివారిగాను

ఆయన పట్ల విశ్వసనీయత లేని ఆత్మలు గలవారి గాను ఉండరు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.