Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 78:12-16

OTSA Telugu Contemporary Version

12 ఆయన వారి పూర్వికుల ఎదుట

ఈజిప్టు దేశంలో, సోయను ప్రాంతంలో అద్భుతకార్యాలు చేశారు.

13 ఆయన సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మధ్యలో వారిని నడిపించారు;

ఆయన నీటిని గోడలా నిలబడేలా చేశారు.

14 పగలు మేఘస్తంభమై,

రాత్రి అగ్ని స్తంభమై వారికి దారి చూపారు.

15 అరణ్యంలో బండలు చీల్చి త్రాగడానికి నీరిచ్చారు.

సముద్రమంత సమృద్ధిగా వారికి నీటిని ఇచ్చారు.

16 ఆయన రాతిలో నుండి ప్రవాహాలను తెచ్చారు

నీటిని నదుల్లా ప్రవహింపజేశారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    12 ఈజిప్టుదేశంలోని సోయను ప్రాంతంలో వారి పూర్వీకుల మధ్య ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు.

    13 ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని అవతలికి దాటించాడు. నీటిని రెండు వైపులా గోడల్లాగా నిలబెట్టాడు.

    14 పగలు మేఘంలో నుండీ రాత్రి అగ్ని వెలుగులో నుండీ ఆయన వారిని నడిపించాడు.

    15 అరణ్యంలో బండరాయిని చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు అనుగ్రహించాడు.

    16 బండలోనుండి ఆయన నీటికాలువలు పారజేశాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.