1 మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు
సర్వశక్తిమంతుని91:1 మూ.భా.లో షద్దాయ్ నీడలో స్థిరంగా ఉంటారు.
2 యెహోవా గురించి నేను చెప్పేదేమంటే, "ఆయనే నా ఆశ్రయం నా కోట,
నా దేవుడు, ఆయననే నేను నమ్ముకున్నాను."
14 "అతడు91:14 అంటే, బహుశ రాజు నన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నేను అతన్ని విడిపిస్తాను"
అని యెహోవా అంటున్నారు;
అతడు నా నామాన్ని గుర్తిస్తాడు, కాబట్టి నేను అతన్ని కాపాడతాను.
15 అతడు నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను;
కష్టాల్లో నేనతనిని ఆదుకుంటాను,
అతన్ని విడిపిస్తాను ఘనపరుస్తాను.
16 దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను,
నా రక్షణ అతనికి చూపిస్తాను.