4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారు,
ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం;
ఆయన నమ్మకత్వం నీకు డాలుగాను గోడగాను ఉంటుంది.
5 రాత్రి భయాలకు గాని,
పగటి పూట ఎగిరి వచ్చే బాణాలకు గాని,
6 చీకటిలో సంచరించే తెగులుకు గాని,
మధ్యహ్నం హఠాత్తుగా కలిగే నాశనానికి గాని,
నీవు భయపడాల్సిన అవసరం లేదు.
15 అతడు నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను;
కష్టాల్లో నేనతనిని ఆదుకుంటాను,
అతన్ని విడిపిస్తాను ఘనపరుస్తాను.