Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 98

ఒక కీర్తన.

1 యెహోవాకు క్రొత్త పాట పాడండి,

ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు;

ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువు

విజయాన్ని కలిగిస్తాయి.

2 యెహోవా రక్షణను వెల్లడించారు.

దేశాల ఎదుట తన నీతిని వెల్లడించారు.

3 ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్ని

చూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు;

మన దేవుని రక్షణ

భూమ్యంతాల వరకు కనపడింది.

4 భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి,

సంగీతంతో ఉత్సాహ గానం చేయి;

5 వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి,

వీణతో, గాన ధ్వనితో,

6 బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ,

రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి.

7 సముద్రం, అందులో ఉన్నదంతా,

లోకం, అందులో జీవించేవారంతా ప్రతిధ్వని చేయును గాక.

8 యెహోవా సన్నిధిలో నదులు చప్పట్లు కొడతాయి.

పర్వతాలు ఆనందంగా పాడతాయి.

9 యెహోవా లోకానికి తీర్పరిగా,

రాజుగా రాబోతున్నారు.

ఆయన పరిపాలన ఆయన తీర్పులు

న్యాయసమ్మతమైనవి.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.