12 వారు లెక్కకు కొద్దిమంది ఉన్నప్పుడు,
ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివారిగా ఉన్నప్పుడు,
13 వారు దేశం నుండి దేశానికి,
ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు.
14 ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు;
వారి కోసం ఆయన రాజులను మందలించారు:
15 "నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు;
నా ప్రవక్తలకు హాని చేయకూడదు."