5 నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు,
మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు.
13 నా అంతరంగాన్ని మీరు సృష్టించారు;
నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.
14 నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి,
అది నాకు పూర్తిగా తెలుసు.
16 నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి;
నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే
అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.